
ఏపీ రాజకీయాలు సురబి కళాకారుల డ్రామాను మించపోతున్నాయి. ఎవరికి వారు ఆస్కార్ రేసులో ఉన్నంత స్థాయిలో రక్తి కట్టిస్తున్నారు. బీజేపీ, టీడీపీ, వైపీపీ ఇందులో ఎవరూ తీసిపోవడం లేదు. అసలు విషయానికి వస్తే.. జగన్ చేసిన రాజీనామాల ప్రకటన రాజకీయంగా కలకలం రేపుతోంది. అయితే ఇదంతా సరికొత్త ఎత్తుగడగానే కనిపిస్తోంది. రాజకీయంగా పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడానికి వైఎస్ వారసుడు అనుసరిస్తున్న పథకంగా మారింది.
కమలనాథులతో బీజేపీ తెగతెంపులకు సిద్దమవుతోంది. రెండువైపులా వినిపిస్తున్న కామెంట్లు ఈ క్లారిటీ ఇస్తున్నాయి. మలివిడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసే ఏప్రిల్ 5 విడాకులకు ముహూర్తంగా నిర్ణయించింది. అప్పటికల్లా గొంతెమ్మకోరికలు అని బీజేపీ చెబుతండగా… టీడీపీ హామీలంటోంది… వీటిని తీర్చడం సాద్యం కాదు. ఇదే సాకుగా టీడీపీ తెగతెంపులకు రెడీ అయింది. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీచేస్తే ఓటమి ఖాయమని నిర్దారణకు వచ్చిన తమ్ముళ్లు.. ప్లానుతో ఉన్నారు. బీజేపీతో విడిపోతే.. మైలేజీ రావడం ఖాయం. తమకు ఎక్కడ మైనస్ గా మారుతుందో అని… వైసీపీ కూడా కార్యాచరణకు సిద్దమైంది. రాజీనామా అస్త్రం ప్రయోగించింది. ముందుగానే ప్రకటించడం వల్ల.. రాజీనామా అనేసరికి టీడీపీ భయపడి.. కేంద్రం నుంచి టీడీపీ బయటకు వచ్చిందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. టీడీపీ ఒత్తిడికి తలొగ్గి కేంద్రం హామీలు అమలుచేస్తే.. జగన్ ఎంపీ రాజీనామా ప్రకటనకు దిగొచ్చిందని తమ ఖాతాలో వేసుకుంటారు. మొత్తానికి ఎవరి వ్యూహాలు వారివే.. అందరిదీ ఎన్నికల తంత్రమే. ముందస్తు వ్యూహమే. దీనికి కీలక ఘట్టం ఏప్రిల్ 6న పడనుంది.