కర్నూలు జిల్లాలో మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని RSS చీఫ్ మోహన్ భగవత్ దరహించుకున్నారు. శ్రీ మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా భగవత్ గ్రామ దేవత మంచాలమ్మ ను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు శేష వస్త్ర ఫల మంత్రాక్చితలతో పాటు రాఘవేంద్ర స్వామి మోమోంటో అందజేసి ఆశీర్వాదించారు. భగవత్ మంత్రాలయం నేటి నుండి సెప్టెంబర్ 2 వతేది వరకు టిటిడి కళ్యాణ మండపంలో అఖిల భారత వివిధ క్షేత్ర సమన్వయ భైటక్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.