ఎంత హ‌డావిడి చేసినా తెలంగాణలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు జ‌నాల్లో ఇమేజ్ సంపాదించుకోలేక‌పోతున్నారు. కేసీఆర్ గ‌తంలో చేసిన రెండు స‌ర్వేల‌తో పాటు.. ఎవ‌రికి వారు సొంతంగా చేయించుకున్న ప్రజాభిప్రాయ‌సేక‌ర‌ణ‌లో కూడా మంచి మార్కులు ప‌డ‌డం లేద‌ట‌. పార్టీ మార‌డాన్ని జ‌నాలు తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్టు స‌ర్వేలో తేలింద‌ట‌.. తాజాగా సీఎం కేసీఆర్ ముచ్చ‌ట‌గా మూడొ స‌ర్వే కూడా సిద్దం చేశారు.. మూడ‌డో స‌ర్వేను మూడు ఏజెన్సీలు చేశాయ‌ట‌.. రెండు ప్ర‌యివేటు ఎజేన్సీలు ప‌క్కాగా స‌ర్వే చేసి నివేదిక‌లు ఇచ్చాయ‌ట‌. మూడోది.. పోలీస్ ఇంటిలిజెన్స్ నివేదిక‌. ఈ మూడు  నివేదిక‌లు క్రోడీక‌రించి ఎమ్మెల్యేల‌కు మార్కులు ఇచ్చార‌ట‌. స‌ర్వేలో బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు.. సిట్టింగు మీద వ్య‌తిరేక‌త ఉంటే.. ఎవ‌రు అభ్య‌ర్ధి అయితే బాగుంటుంది అని కూడా స‌మాచారం సేక‌రించార‌ట‌.  అదే స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్ధి పార్టీలో బ‌లంగా ఉన్న నాయ‌కులు వివ‌రాలు కూడా సేక‌రించిన‌ట్టు తెలుస్తుంది. కేసీఆర్ త్వ‌ర‌లోనే స‌ర్వేపై ఎమ్మెల్యేల‌తో మీటింగ్ పెట్టి చ‌ర్చించ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. ఈ మీటింగు త‌ర్వాత ఎవ‌రికి టికెట్‌.. మ‌రెవ‌రికి నో తెలిసిపోతుంద‌ని పార్టీ వ‌ర్గాలంటున్నాయి. పార్టీలో మొద‌టి నుంచి ఉన్న‌వారి కంటే… వ‌ల‌స వ‌చ్చిన ఎమ్మెల్యేల‌పై వ్య‌తిరేక‌త భాగా ఉంద‌ని స‌ర్వేలో తేలింద‌ట‌. దీంతో మెజార్టీ వ‌ల‌స నాయ‌కుల్లో టెన్ష‌న్ ప‌ట్టుకుంది. త‌మ భ‌వితవ్యంపై ఆందోళ‌న‌గా ఉన్నారు. అయితే కేసీఆర్ అంద‌రికీ కాక‌పోయినా.. కొంద‌రికి న్యాయం చేద్దామ‌ని ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. కొందిరికి ఎంపీ టికెట్ ఇచ్చి… ఎంపీల‌ను ఎమ్మెల్యేలుగా పంపడం ద్వారా కొన్ని చోట్ల వ్య‌తిరేక‌త‌ను అధిగ‌మించివ‌చ్చ‌ని.. అదే స‌మ‌యంలో న్యాయం చేసిన పేరు ఉంటుంద‌ని కేసీఆర్ ఆలోచ‌న‌. మ‌రికొంద‌రికి ఎన్నిక‌ల త‌ర్వాత నామినేటెడ్ పోస్టుల‌పై భ‌రోసా ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట‌. ఏదోవిధంగా ప్ర‌జావ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉండి.. స‌ర్వేలో త‌క్కువ మార్కులు వ‌చ్చిన వారిని తిరిగి ఎమ్మెల్యేలుగా నిల‌బెట్ట‌డానికి కేసీఆర్ సిద్దంగా లేర‌ట‌. తెలిసి తెలిసి అధికారం చేజార్చుకోవ‌డ‌మే అవుతుంద‌ని.. అందుకే ముందుగానే వారికి న‌చ్చ‌జెప్పి.. దారికి తెచ్చుకోవ‌డానికి త్వ‌ర‌లోనే రంగంలో దిగ‌నున్నారు. ఒక్క‌క్క‌రితో విడిగా స‌మావేశం అయి.. ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌పై కేసీఆర్ వారితో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. మొత్తానికి స‌ర్వే పుణ్య‌మా అని సిట్టింగు ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి వార్త వ‌స్తుందో అని టెన్ష‌న్ ప‌డుతున్నారు.